BRS : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్

BRS : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్
తాను చెప్పే లెక్కలన్నీ అబద్ధాలైతే రాజీనామాకు సిద్ధమని మోదీకి కేసీఆర్ సవాల్ విసిరారు

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సంచలన సవాల్ విసిరారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మోదీ 8 పాలన తీరును లెక్కలతో సహా ఎండగట్టారు. మోదీ హయాంలో దేశ తలసరి ఆదాయం సగానికి పడిపోయిందన్నారు. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.7 శాతం ఉంటే మోదీ వచ్చాక ద్రవ్యలోటు 5.1 శాతానికి పెరిగిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో అంతా సైలెన్స్ రాజ్ అని ఎద్దేవా చేశారు. తాను చెప్పే లెక్కలన్నీ అబద్ధాలైతే తాను రాజీనామాకు సిద్ధమని మోదీకి కేసీఆర్ సవాల్ విసిరారు.

మోదీ హయాంలో ప్రతి రంగం దివాళా తీసిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మోదీ పాలనా తీరును శుక్రాచార్యుడి కథతో పోల్చారు. హిండెన్‌బర్డ్ నివేదిక.. నష్టపోయిన ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ పెట్టుబడులను ప్రస్తావించారు. అదానీ రూపంలో వచ్చి ఉపద్రవంపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసలు విషయాలు పక్కనబెట్టి మోదీ జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల తీరు ఛోటా భాయ్ సుభానల్లా.. బడే భాయ్ మాషాల్లా అన్నట్లు ఉందని కేసీఆర్ చురకలంటించారు. అసెంబ్లీ వేదికగా బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయం, ప్రగతిభవన్లను కూల్చేస్తాం, పేల్చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో ఇక నుంచి కరెంట్ కోతలు ఉండవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

Tags

Next Story