BRS : నా చావు కోసం ఎదురుచూస్తున్నరు : ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌

BRS : నా చావు కోసం ఎదురుచూస్తున్నరు : ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌
X
నా ఓటమి కోసం గతంలో పని చేశారు.. భవిష్యత్‌లోనూ మా పార్టీ నుంచి పని చేస్తారంటూ బాంబు పేల్చారు.

బీఆర్‌ఎస్‌ డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యగారిపల్లిలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రెడ్యా నాయక్‌... తానెప్పుడు చస్తానా అని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారని.. నా ఓటమి కోసం గతంలో పని చేశారు.. భవిష్యత్‌లోనూ మా పార్టీ నుంచి పని చేస్తారంటూ బాంబు పేల్చారు. మనలో ఇంటి దొంగలు ఉన్నారు జాగ్రత్త... పార్టీ పేరు చెప్పుకుని లక్షలు సంపాదిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఐతే.. రెడ్యా నాయక్‌ పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది.

Tags

Next Story