KCR:అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్

KCR:అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
X
బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారని తెలిపిన కేటీఆర్

ఈనెల 12 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు వినేందుకు ఆయన అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, కానీ బడ్జెట్ ప్రసంగంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారని కేటీఆర్ వెల్లడించారు. అయితే ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా..? లేదా..? అని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు.

ముహూర్తం ఖరారు

అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ ప్రసంగానికి కేసీఆర్‌ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. బడ్జెట్‌ ప్రసంగంలోనూ కేసీఆర్‌ పాల్గొంటారని కేటీఆర్‌ వెల్లడించారు. బుధవారం కేసీఆర్ సభకు హాజరవ్వనున్నారు. కేసీఆర్ సభకు వస్తుండటాన్ని బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతిస్తున్నాయి. కేసీఆర్ ప్రసంగంపైనా ఆసక్తి నెలకొంది.

లక్షలాది మందితో వరంగల్ సభ: హరీశ్

వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ యవ్వనంలోకి ప్రవేశిస్తోందన్న హరీశ్.. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రేవంత్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి బాయి ఫూలే అందించిన స్పూర్తితోనే KCR 1000కి పైగా గురుకులాలను స్థాపించారని మాజీమంత్రి హరీష్ రావు ‘X’లో తెలిపారు. ‘ఉపాధ్యాయిని, రచయిత్రిగా నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రి బాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. మహిళలకు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, విద్యావకాశాల కోసం విశేషంగా కృషి చేయడంతో పాటు, కుల, మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన గొప్ప వ్యక్తి ఆమె’ అని ట్వీట్ చేశారు.

Tags

Next Story