KCR: వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నాము కదా అని అహంకారంతో మాట్లాడకూడదని అధికారం శాశ్వతం కాదని కేసీఆర్ అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం బీఆర్ఎస్ పార్టీదే. సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలని.. కూలగొడతామని పిచ్చిగా మాట్లాడొద్దు. మాకు మాటలు రావనుకుంటున్నారా? ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా. అరెస్టులకు భయపడేది లేదు. ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు.' అని ఆయన చెప్పారు.
రౌడీ పంచాయతీలు మాకు వచ్చు
రౌడీ పంచాయితీలు చేయడం తమకు వచ్చని కేసీఆర్ అన్నారు. తిట్టడం కూడా వచ్చని... ఈరోజు తిట్టడం మొదలు పెడితే.. రేపటి వరకు తాను తిడుతూనే ఉంటానని కేసీఆర్ అన్నారు. ప్రజలు తమకు సేవ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారన్నారు. ప్రభుత్వం ప్రజలను కాపాడాలే తప్ప.. భయపెడతారా అంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 11 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలు కాంగ్రె్‌సకు అధికారమిచ్చింది కూల్చడానికి కాదని, నిర్మించడానికని అన్నారు. ప్రభుత్వం అంటే.. అందరినీ కాపాడుకోవాలని, పిచ్చిపిచ్చిగా మాట్లాడడం కాదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మించాలని హితవుపలికారు.
వందశాతం విజయం మనదే
తెలంగాణ ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో 100% మనమే అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నారని కేసీఆర్ తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందని.. ప్రజలు మనపై విశ్వాసంతో ఉన్నారన్నారు. మనమంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. అధికారంలోకి రాగానే వాడిని లోపలేయాలి.. వీడిని లోపలేయాలని చూడబోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా మాట్లాడుతున్నారో అంతా స్వయంగా చూస్తున్నారని అన్నారు. ప్రజలు అధికారమిచ్చింది సేవ చేయడానికా? లేనిపోని మాటలతో కాలయాపన చేయడానికా అని కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే. కానీ, ఎవరూ అడగకున్నా 90% పనులు చేసి, చూపించామని కేసీఆర్ గుర్తు చేశారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. కార్యకర్తలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు
కేసీఆర్‌పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మూసీని వ్యతిరేకిస్తే కేసీఆర్‌ను ఖండఖండాలుగా నరికి మూసీలో వేస్తామంటూ వ్యాఖ్యలు చేశారని.. ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని శనివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com