TG: తెలంగాణ కోసమే పని చేశాం: హరీశ్ రావు

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫార్మూలా ఈ రేసు అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన కేసు అక్రమమని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అక్రమ కేసు కాబట్టే చర్చకు అనుమతించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. తాము తప్పు చేస్తే సభలోనే ప్రజలకు చెప్పాలని వెల్లడించారు. ఒక ఎమ్మెల్యే మీద అక్రమ కేసు పెట్టారని.. దానిపై చర్చ జరపాలని హరీశ్ డిమాండ్ చేశారు. తాము తెలంగాణ కోసమే పనిచేశామని అన్నారు. దీనికి ప్రభుత్వం ససేమీరా అనడంతో బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఫార్మూలా ఈ కార్ రేసుపై కేసు పెట్టి కేటీఆర్ ను అపఖ్యాతి పాల్జేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కావాలనే గొడవ: రేవూరి
ఫార్మూలా ఈ రేసు అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ నేతలు.. పట్టుబట్టడంపై కాంగ్రెస్ మండిపడింది. అసెంబ్లీ రూల్స్ తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి అన్నారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com