TG: చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి విడుదల

చర్లపల్లి జైలు నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విడుదలయ్యారు. లగచర్ల ఘటనలో ఆయన అరెస్టై చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులకు పోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చేతనైతే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్‌లు చేస్తోందన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా కేటీఆర్‌ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు.
బెయిల్ ఇచ్చిన హైకోర్టు
సంచలనం రేపిన లగచర్ల రైతుల దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని ఏ1 నిందితుడిగా చేర్చుతూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2(A2) గా సురేష్ సహ మరో 24 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో నేడు పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా సురేష్ తో మహా మిగిలిన 24 మందికి కూడా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. పట్నంకు రూ.50 వేల పూచీకత్తు విధించగా, మిగిలిన వారికి రూ.20 వేల పూచీకత్తు విధిస్తూ కోర్ట్ ఈ బెయిల్ మంజూరు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com