BRS: సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

BRS: సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
X
సీఎం రేవంత్ రెడ్డిని ముద్దాయిగా చేర్చాలని ఫిర్యాదు చేసిన ఆర్ఎస్సీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుల్లో ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని చేర్చాలని ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ రేస్ పై రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక పెట్టుబడులు వెనక్కి పోయాయని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం( వచ్చిన నాటి నుంచి గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ లో అవినీతి జరిగిందని, ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ ఈడీ, ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించి నాటి ప్రభుత్వం యూకేకు చెందిన ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్‌ శాఖ నుంచి హెచ్‌ఎండీఏ చెల్లించింది. కాగా ఈ చెల్లింపులలో ఉల్లంఘనలు జరిగాయంటూ ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ సహా పలువురిపై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

గణతంత్ర వేడుకల్లో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్న సీఎం.. తడి బట్టలతో పాలమూరు మహిమాన్విత కురుమూర్తి స్వామి గుడికి పోదాం? ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దాం? నేను రెడీ, నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి? ’ అని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు.

మాట తప్పడమే కాంగ్రెస్ మార్క్

పథకాల అమలులో ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు మండిపడ్డారు. మాట తప్పడం, మడిమ తిప్పడమే. కాంగ్రెస్‌ మార్కు పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే 2023, డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారని... తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి 2024, ఆగస్టు 15కు వాయిదా వేశారని గుర్తు చేశారు.

Tags

Next Story