KOUSHIK REDDY: నన్ను చంపేందుకు కుట్ర: కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నం చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి దాడులు చేసి తమ నోరు నొక్కాలని చూస్తున్నారని అన్నారు. తాను ఏ తప్పు చేశాననో పోలీసులు చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. మరో నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా కౌశిక్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మరో బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఇంటిపై దాడి చేసి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని.. ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకే సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లామని... కానీ తమను లోపలికి కూడా అనుమతించలేదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
హరీశ్ ఎంతదూరమైనా వెళతారా..?
అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేస్తూ సీపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన మాటల యుద్ధంలో హరీశ్ ఎలివేట్ అయ్యారు. పార్టీని, పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం ఎంత దాకా అయినా వెళతామనే సంకేతాలిచ్చారు. దీంతో ఒక్కసారిగా హరీశ్‌పై మరోసారి చర్చ ఆరంభమైంది. అయితే ఆందోళన సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుకు గాయమైనట్లు తెలుస్తోంది. సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద అరెస్టు చేసిన ఆయనను కేశంపేట పీఎస్‌కు తరలించారు. అక్కడికి BRS కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ క్రమంలోనే హరీష్‌ను పోలీస్ బస్సు నుంచి పీఎస్‌లోకి తీసుకెళ్తుండగా తోపులాట జరిగింది. దీంతో హరీష్ రావు భుజానికి గాయమైంది. కాగా, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com