BRS MLA Case : "సీబీఐ విచారణతో బండారం బయటపడుతది"

BRS MLA Case : సీబీఐ విచారణతో బండారం బయటపడుతది
X
బీజేపీని బద్నాం చేసేందుకు ప్రయత్నించారని.. అందుకే సీబీఐ విచారణ కోరామని రఘునందన్‌ స్పష్టం చేశారు

సీబీఐ విచారణతో ఫాంహౌజ్‌ కేసులోని అన్ని అంశాలు బయటకు వస్తాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. దొంగనే దొంగ అన్నట్లుగా బీఆర్‌ఎస్‌ నేతల వ్యమహరిస్తున్నారని అన్నారు. బీజేపీని బద్నాం చేసేందుకు ప్రయత్నించారని.. అందుకే సీబీఐ విచారణ కోరామని రఘునందన్‌ స్పష్టం చేశారు. పోలీసులను టూల్‌గా పెట్టి.. ఫోటోలు, వీడియోల మార్ఫింగ్‌తో.. ఇవే ఆధారాలు అంటే సరిపోదన్నారు. రోహిత్‌ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్తే అన్ని నిజాలు బయటపడతాయన్నారు రఘునందన్‌.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాని సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇవ్వడంతో తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ సర్కార్‌ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో జనవరి 18న ఇరుపక్షాల వాదనలు విప్న చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పును రిజర్వ్‌ చేసి ఇవాళ వెల్లడించారు.

Tags

Next Story