TS: సీఎం రేవంత్‌కి హరీష్ రావు లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. మేనిఫెస్టోలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం చేయకుండా ఇలా చేయడం దారుణమని లేఖలో పేర్కొన్నారు రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమని, అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేస్తుండటం మోసం చేయడమే అని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం చేయకుండా, అర్హులైన వారికి ఎగనామం పెట్టే విధంగా ఉన్న నిబంధనలను, మీ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు.
హరీష్ రావుకు సీతక్క కౌంటర్
బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు దొంగ ప్రేమ గురించి అందరికీ తెలుసని, ఇకనైనా నాటకాలు ఆపాలంటూ కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల అధికారంలో కోటీశ్వరులకు కొమ్ము కాసిన కపట ప్రేమికులు ఇపుడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తుంటే.. ఇప్పుడు హరీష్ రావు కొత్త రాగాలు పలకడం విడ్డూరమన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సత్తాచాటాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com