HARISH: కేసీఆర్‌ను సీఎం చేసేదాకా విశ్రమించబోం

HARISH: కేసీఆర్‌ను సీఎం చేసేదాకా విశ్రమించబోం
X
తాను, కేటీఆర్‌ పోటీ పడి మరీ పనిచేస్తామన్న హరీశ్‌రావు.. కేసీఆర్‌ చావు కోరుకుంటారా అని సూటి ప్రశ్న

తెలంగాణ రాష్ట్రానికి శ‌నిలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేదాకా.. కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసే దాకా విశ్రమించేది లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసే దాకా.. తాను, కేటీఆర్ పోటీ పడి మరీ కసిగా పనిచేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. తమ మ‌ధ్య ఎలాంటి కుమ్ములాట‌లు లేవని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. ప్రతిప‌క్ష ప‌ద‌వి కోసం తాను కేటీఆర్ కొట్లాడుతున్నామ‌ని రేవంత్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమ‌కారులమని... కేసీఆర్ ఆదేశాల‌తోని మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశానని హరీశ్ గుర్తు చేసుకున్నారు. తాము కేసీఆర్ ఆదేశాల‌ను తూచా త‌ప్పకుండా పాటించే క్రమ‌శిక్షణ గ‌ల కార్యక‌ర్తలం తామిద్దరమని వెల్లడించారు.

కేసీఆర్ చావు కోరుకుంటారా?

రేంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ దశాదిశ మార్చిన, చూపిన నేత కేసీఆర్, అలాంటి కేసీఆర్‌ను మార్చురీకి పంపాలని అంటారా? కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం రేవంత్ మాట్లాడారు. అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. అందాల పోటీలే కాదు.. తిట్ల పోటీలు పెట్టండి. తిట్లపోటీలో రేవంత్‌ను మించిన వారు లేరు. మీ చర్యల వల్ల రాష్ట్రం పరువుపోతోంది’ అని మండిపడ్డారు.

అడ్డమైన ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి హరీష్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని.. అడ్డమైన ఈ భాషకూ ఆద్యుడే రేవంత్ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నేతలను ట్రోలింగ్ చేసిన చరిత్ర ఆయనదని, రేవంత్ రెడ్డి ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నరేటివ్స్, ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్, ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్, ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సినర్స్ అని హరీష్ ఆగ్రహించారు.

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అడ్డమైన ఈ భాషకి ఆద్యుడే రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే సొంత పార్టీ నేతలను ట్రోలింగ్ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నరేటివ్స్, ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్, ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్, ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సినర్స్ అన్నారు.


Tags

Next Story