Kaushik Reddy : రేవంత్ గుండెల్లో నిద్రపోతా: కౌశిక్ రెడ్డి

Kaushik Reddy :  రేవంత్ గుండెల్లో నిద్రపోతా: కౌశిక్ రెడ్డి
X
పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై రెచ్చిపోయారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ తన దగ్గరకు వచ్చారని.. పీసీసీ పదవి ఇప్పించాలని బతిమిలాడారని వివరించారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కౌశిక్.. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం.. రేవంత్ రెడ్డి పైన హత్యయత్నం కేసు నమోదు చేయాలని డీజీపీనీ డిమాండ్ చేస్తున్నాం.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి కుటుంబానికి మంచి పేరు ఉన్నది.. అవినాశ్ మహంతి తమ్ముడు కరీంనగర్ సీపీ డైనమిక్ గా పని చేస్తున్నాడు.. దగ్గర ఉండి దాడి చేసిన ఏసీపీ, సీఐనీ అవినాష్ మహంతి ఎందుకు సస్పెండ్ చేయలేదు అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

ఇక, మేము అధికారంలోకి రాగానే ఏసీపీ, సీఐ సంగతి చూస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నా వీపు చింతపండు అయిందనీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వీపు చింతపండు అయింది.. సీఎం రేవంత్ రెడ్డి స్థాయి నా స్థాయి కూడా కాదు… చిల్లర వీధి రౌడిల స్థాయి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నా కాళ్ళు మొక్కాడు.. నా కాళ్ళు మొక్కిన తరువాతనే రేవంత్ రెడ్డినీ పీసీసీ అధ్యక్షుడునీ చేశామన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డినీ గద్దె దించుడు ఖాయం.. చిల్లర గుండాలతో సీఎం రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేపిస్తున్నాడు.. నన్ను చంపుతాం అని బెదిరిస్తున్నారు.. ప్రజల కోసం నేను చావడానికైన సిద్ధంగా ఉన్నా.. నా జోలికి వచ్చిన వారిని ఖతం పెట్టించిన అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Tags

Next Story