koushikreddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్.. బెయిల్‌పై విడుదల

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్.. విడుదలతో శనివారం తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. తొలుత కౌశిక్‌రెడ్డిని బెదిరింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ నెలకొంది. తొలుత కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారంటూ వార్తలు వచ్చాయి. అనంతరం కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బెదిరింపు కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం కౌశిక్‌రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కు తరలించి.. తొలుత ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. తొలుత కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఖమ్మం జైలుకు తరలించేందకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోపు 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో.. రిమాండ్ రద్దు చేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పాడి కౌశిక్‌రెడ్డి క్వారీ యజమాని భయభ్రాంతులకు గురి చేశారని.. అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాధించింది. మొదట ఎఫ్ఐఆర్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. 308 సెక్షన్ 4ని తర్వాత మార్చి ఫైవ్ చేయడంతో నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని లీగల్ టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించవద్దని.. లీగల్ టీం వాధించింది. ఇరు వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
కేసు ఏంటంటే..
మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com