BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్థితి విషమం..!

భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.మాగంటి గోపీనాథ్ గతకొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనధికారికంగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లడానికి కారణం వైద్య పరీక్షలు కాదని గోపీనాథ్ ను పరామర్శించడానికని తెలుస్తోంది.
కిడ్నీ సమస్యే కారణమా.. ?
కొన్నాళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. కిడ్నీ ఫెయిల్యూర్ అని పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం మరింత అనారోగ్యానికి గురవ్వటంతో.. కుటుంబ సభ్యులు గచ్చిబౌలి AIG ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయడంతో పెరిగి పెద్దదయిపోయింది. నాలుగు రోజుల కిందట తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు.కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఏఐజీ ఆస్పత్రి అధికారికంగా స్పందించలేదు. ఎమ్మెల్యే అనారోగ్యం అంశాన్ని గుట్టుగానే ఉంచాలని అనుకోవడంతో కుటుంబసభ్యులు కూడా ప్రకటించలేదు. బయటకు సమాచారం లీక్ అయినందున హెల్త్ బులెటిన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com