CONGRESS: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

బీఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో హస్తం పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. అరికెపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
గత మూడు నెలల క్రితమే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు కూడా పూర్తయ్యాయని ఇక.. కండువా కప్పుకోవటమే తరువాయి అన్న సందర్భంలో.. బీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు. ప్రకాష్ గౌడ్‌తో మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీని వీడొద్దంటూ బుజ్జగింపులు జరిపారు. దీంతో.. ప్రకాష్ గౌడ్ మనుసు మార్చుకోవటంతో చేరికకు అప్పుడు బ్రేక్ పడింది. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నాయకత్వానికి షాక్ ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలైన.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీళ్లతో పాటు ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బిగ్ షాక్ ఇచ్చారు. కాగా.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా సీరియస్‌గా ఉంది. . కీలక నేతలతో ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అటు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ పై జూలై 11న విచారణ చేప్టటింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు .. తదుపరి విచారణను సోమవారానికి జూలై 15కు వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com