BRS MLAs CASE: సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాని సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో జనవరి 18న ఇరుపక్షాల వాదనలు విప్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com