KTR: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X
గురుకులాల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన... కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ బీఆర్ఎస్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు నేడు గురుకులం పేరు చెబితేనే డీలా పడిపోతున్నారు. ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా సర్కారులో చలనం లేదు. ’ అని ట్వీట్ చేశారు.

ఆడబిడ్డలారా.. జర పైలం

‘నిన్న గేటు ఎత్తుకెళ్లారు. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా? తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలం. అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా? సాగు నీళ్లిచ్చే సోయి లేదు. పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు. కానీ.. రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా? . ’ అని ట్వీట్ చేశారు.

పార్టీ శ్రేణులకు కీలక పిలుపు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

మెరుగైన యంత్రాంగం అవసరం

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు పిల్లలు సహా 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినమవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో జన సమూహ నియంత్రణకు మెరుగైన యంత్రాంగం అవసరం. ’ అని ట్వీట్ చేశారు.

Tags

Next Story