KCR: ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి
సార్వత్రిక ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలను కైవసం చేసుకుని సత్తాచాటేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బస్సుయాత్ర, రోడ్‌షోలతో ప్రజల్లోకి వెళ్తున్నా గులాబీదళపతి అధికార పార్టీ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేసి రైతు బంధు రాకుండా చేశారని KCR ఆరోపించారు. కామారెడ్డి, మెదక్ లో రోడ్ షో నిర్వహించిన KCR... ప్రధాని మోదీ, CM రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మోదీ 150 హామిలిచ్చి ఒక్కటీ నేరవేరలేదన్న KCR అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావన్న మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేతలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు.
తెలంగాణకు ఎప్పటికైనా గులాబీ జెండానే శ్రీరామరక్ష అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా అంబర్‌పేటలో KTR రోడ్ షో నిర్వహించారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి రూపాయి సాయం చేయలేదని, ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉండి ఐదురూపాయల పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే పెట్రోల్, డీజీల్ ధరలు విపరీతంగా పెరుగుతాయన్న KTR...... మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే భారాసకు ఓటేసి గెలిపించండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్దిరోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. భద్రాచలంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ MLC దండే విఠల్ కాగజ్‌నగర్‌లో ప్రచారం చేశారు. పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్..... మంథని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా..... భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ కండువాను గాల్లో తిప్పుతూ ప్రచారం చేశారు. దీంతో కార్యకర్తలు ఉత్సహంగా డాన్సు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com