BRS: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులతోనే పోలీసు కుటుంబాలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పాలనలో ఒట్లు, తిట్లు తప్పి ఇంకేం లేదని విమర్శించారు. గొప్పగా ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయటంలో విఫలమైందని అన్నారు. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో.. ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయిందని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పండుగలాంటి వ్యవసాయానికి రాష్ట్రంలో గ్రహణం పట్టిందని అన్నారు.BRS: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com