BRS: నేడే బీఆర్ఎస్ మహా ధర్నా

తెలంగాణలో శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ నల్లగొండ పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నేడు రైతు మహాధర్నాను నిర్వహించనున్నారు. క్లాక్ టవర్ వేదికగా నిర్వహిస్తున్న రైతు మహా ధర్నాకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు హాజరు కానున్నారు. రైతు మహా ధర్నాలో పాల్గొనేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చే అవకాశం ఉంది. మహా ధర్నా ఏర్పాట్లను.. బీఆర్‌ఎస్ జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ పరిశీలించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మహా ధర్నాను నిర్వహించాల్సి ఉంటుంది. ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణ మాఫీ, రైతు భరోసా, కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై సర్కార్‌ను నిలదీయనున్నారు. ఈనెల 21 మహా ధర్నా జరగాల్సి ఉండగా.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 26న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు: కేటీఆర్
జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే బుద్ధి ఈ డూప్లికేట్ గాంధీలకు ఇవ్వాలని మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన MLC కవిత
చండ్రుగొండ మండలంలోని బెండాలపాడులో నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఘర్షణలో గాయాలైన బీఆర్ఎస్ నేత మేడ మోహన్ రావును MLC కల్వకుంట్ల కవిత ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గొడవకు గల కారణాలపై ఆరా తీశారు. కోడెం రవి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com