KTR: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

ఫార్ముల ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కేసును మరింత దర్యాప్తు చేయాలని, పూర్తి ఆధారాలు లేకుండా కేసును క్వాష్ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయనిపుణులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లాలా లేకపోతే సుప్రీంకోర్టుకా అన్నదానిపై చర్చించారు. చివరికి తన న్యాయవాది సిద్ధార్థ దవే ఇచ్చిన సలహాతో కేటీఆర్ సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు.
హైకోర్టులో కేటీఆర్‌కు షాక్
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలన్న క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తేసింది.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన
ఫార్మూలా ఈ-కార్ రేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో BRS శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నందినగర్‌లో తన నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపి సుప్రీంలో పిటిషన్ వేశారు.
కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా.. కేటీఆర్ ఈరోజు(మంగళవారం)ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కూడా నోటీసులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com