KTR: కాంగ్రెస్ సర్కార్ పై రేవంత్ ఆగ్రహం

సర్కార్ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. నీళ్లన్నీ తరలించుకుపోయిన తర్వాత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరికగా టెలీమెట్రీల గురించి మాట్లాడుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుండి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు’ అని ట్వీట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Xలో స్పందించారు. ఓయూలో ఆంక్షలు విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతునొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమని తెలిపారు.
బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది: కేటీఆర్
BRS చెప్పిందే నిజమవుతోందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీమంత్రి KTR ‘X’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్, BJP కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అక్షర సత్యమని తేలిపోయింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సింగరేణిని కాపాడుకునేందుకు BRS ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తాం. కార్మికుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చవిచూపిస్తాం’ అని ట్వీట్ చేశారు.
పదవుల కోసం పోటీ పడం: హరీశ్
“కేటీఆర్, నేను పదవుల కోసం పోటీ పడము, కానీ కేసీఆర్‌ను సీఎం చేసేదాకా పోరాడతాం” అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిష్ రావు ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో తెలిపారు. “మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు పోటీ పడి పని చేస్తాం” అని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. “బీఆర్ఎస్ అందరిదీ ఒకే ఆశయం – కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడం” అని హరీష్ రావు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com