TG:కాంగ్రెస్ కాదు.. ఖూనీకోర్: కేటీఆర్

TG:కాంగ్రెస్ కాదు.. ఖూనీకోర్: కేటీఆర్
X
రైతుల ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం.. రేవంత్ రెడ్డిపై పదునైన విమర్శలు

కాంగ్రెస్ కాదు ఖూనీకోర్ అంటూ మాజీ మంత్రి KTR ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిది. రైతు రాజ్యం కాదు, రైతును వంచిస్తున్న రాజ్యం. రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదు, వాళ్ల ప్రాణంతీసేలా క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యం. ఇవి ఆత్మహత్యలుకావు మీరు చేసిన హత్యలే. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి.’ అని ట్వీట్ చేశారు.

పోయింది అధికారమే.. పోరాటం కాదు: కేటీఆర్

బీఆర్ఎస్‌కు పోయింది అధికారమే అని.. పోరాటం కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కార్మికుల కోసం కేసీఆర్ ఎంతో చేశారని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించింది కేసీఆరే అని వెల్లడించారు. కరోనా సమయంలో వలస కార్మికులను ఆదుకున్నామన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్.. అన్ని వర్గాల ప్రజలు మెచ్చిన నాయకుడని అన్నారు.

రేవంత్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. 'అధికారంలోకి వచ్చిన ఏడాదికే లక్షా 40 వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు. ఒక కొత్త ఇటుక పెట్టినవా, ఒక కొత్త పైప్ లైన్ వేసినావా, ఒక కార్మికుడికి లాభం తెచ్చావా, ఒక ఆడబిడ్డకు రూ.2500 ఇచ్చావా, తులం బంగారం ఇచ్చవా.. ?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Tags

Next Story