KTR: జైలుకు పంపితే యోగా చేసుకుంటా: కేటీఆర్

KTR: జైలుకు పంపితే యోగా చేసుకుంటా: కేటీఆర్
X
మొగోనివైతే మెగా ఇంజనీరింగ్ మీద కేసు పెట్టు... మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తనపై కేసులు పెట్టేందుకు సిద్ధమైందంటూ తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు స్పందించారు. జైలుకెళ్లేందుకైనా తాను సిద్ధమని అన్నారు. జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతానని చెప్పారు. జైలుకు పంపితే యోగా చేసుకుంటానని కేటీఆర్ అన్నారు. ‘నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి. నాకేం ఫరక్ పడదు. ఓ రెండు నెలలు, మూడు నెలలో జైలులో పెట్టి పైశాచికానందం పొందుతానంటే నాకేం అభ్యంతరం లేదు. జైలులో యోగా చేసుకొని వచ్చాక పాదయాత్ర చేస్తా’ అని అన్నారు.

మొగోనివైతే కేసు పెట్టు: కేటీఆర్

‘రేవంత్.. నువ్వు మొగోనివే అయితే మెగా ఇంజనీరింగ్ క్రిష్ణారెడ్డి ఇంటి మీద ఏసీబీని పంపించు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మెగా ఇంజనీరింగ్ నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టులో ఇంటెక్ వెల్ గోడ మొత్తం కూలిపోయి.. రూ.80 కోట్ల నష్టం జరిగింది. నీవు మొగోనివే అయితే ఏసీబీని, మెగా కృష్ణారెడ్డి మీదికి పంపు చూస్తా.. దమ్ము ఉందా.. ?’ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని కేటీఆర్ అన్నారు . తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కుంటానని అన్నారు. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఫార్ములా 1 రేసింగ్ ను నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడతాయని, అయితే, దాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ కు మొగ్గు చూపామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

గతాన్ని మరొవద్దు

కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు జరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. వాటి కోసం రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ఖర్చు సహజమే అన్నారు. కామన్వెల్త్ క్రీడల కోసం అయితే అసలు ఖర్చు కంటే కాంగ్రెస్ 100 రెట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుత నిర్వహణ ఖర్చు పది... పదిహేను రెట్లు పెరుగుతుందన్నారు. తాము ఓ మంచి విద్దేశంతో నిర్వహిస్తే కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు ఈ రేసును రద్దు చేసినందుకు రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖలపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు తాము బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తే రేవంత్ రెడ్డి బ్యాడ్ ఇమేజ్ తెస్తున్నారన్నారు. మేఘా కృష్ణారెడ్డి ఇంటికి ఏసీబీని పంపే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. సుంకిశాల ఘటనలో అవినీతి కేసు పెట్టాల్సి వస్తే కృష్ణారెడ్డిపై పెట్టాలన్నారు. రూ. 80 కోట్లు నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు.

Tags

Next Story