Budget 2023 : బీజేపీ పాలిత రాష్ట్రాలపై వరాల జల్లు : కవిత

2023 బడ్జెట్ పై స్పందించారు బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత. బీజేపీ పాలిత రాష్ట్రాలలో, ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై మాత్రమే కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని అన్నారు. ఏడు లక్షల ఆదాయంపై, పన్ను రాయితీ తెలంగాణకు ఉపయోగం లేదన్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఈ బడ్జెట్ ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. 10 లక్షల వరకు పన్ను రాయితీని తాము ఆశించినట్లు కవిత తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలను బాకీ ఉందని అన్నారు కవిత. వాటిని తొందరగా రాష్ట్రానికి చెల్లించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని అభ్యర్థిస్తున్నట్లు ఆవిడ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రకటించిందన్నారు. మౌళిక సదుపాయాలకోసం పదివేల కోట్ల రూపాయలను ప్రకటించారని.. అవి ఏ మౌలిక సదుపాయాలో స్పష్టత లేదని ఆవిడ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com