25 Aug 2021 2:00 AM GMT

Home
 / 
తెలంగాణ / 'బుల్లెట్టు బండి'...

'బుల్లెట్టు బండి' వధువుకు బంపర్‌ ఆఫర్‌..!

తన పెళ్లి బరాత్ లో ‘బుల్లెట్టు బండి’ పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది నవయువ వధువు సాయిశ్రీయ..

బుల్లెట్టు బండి వధువుకు బంపర్‌ ఆఫర్‌..!
X

తన పెళ్లి బరాత్ లో 'బుల్లెట్టు బండి' పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది నవయువ వధువు సాయిశ్రీయ.. ఆమె చేసిన ఈ డాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే సాయిశ్రీయకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఆమె ఏ పాటకైతే డ్యాన్స్‌ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ.. నిర్మించబోయే తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు ఆ సంస్థ నిర్వాహకురాలు. అవకాశం రావడంతో సాయిశ్రీయ కాదనలేకపోయింది. త్వరలోనే సాయిశ్రీయ ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది.

కాగా మంచిర్యాల జిల్లా అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు ఈ సాయిశ్రీయ. ఈ నెల 14న రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఆమెకి వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక అప్పగింతల సమయంలో వధువు చేసిన డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంది. దీనితో సాయి శ్రీయ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. కాగా సాయి శ్రీయ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త అశోక్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

ఇక బుల్లెట్టు బండి పాటకి లక్ష్మణ్‌ సాహిత్యానికి ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఈ పాటను బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. ఈ పాటతో 'బుల్లెట్‌ బండి' పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్‌ వచ్చింది.

Next Story