రాజన్న సన్నిధిలో 'బుల్లెట్టు బండి' కపుల్స్.. ఎగబడ్డ జనం..!

రాజన్న సన్నిధిలో బుల్లెట్టు బండి కపుల్స్.. ఎగబడ్డ జనం..!
X
పెళ్లి బరాత్ లో బుల్లెట్టు బండి పాటకి డాన్స్ చేసి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది నవవధువు సాయిశ్రీయ.

పెళ్లి బరాత్ లో బుల్లెట్టు బండి పాటకి డాన్స్ చేసి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది నవవధువు సాయిశ్రీయ. తన భర్తకి ఈ పాటని డెడికేట్ చేసినట్టుగా సాయిశ్రీయ టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈనెల 14న సాయిశ్రీయకి.. అశోక్ తో పెళ్లి అవ్వగా ఈ జంట ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అశోక్, సాయిశ్రీయల దంపతులను చూసేందుకు జనం ఎగబడ్డారు. మీడియా సైతం ఈ కపుల్స్ కవరేజీ కోసం పోటీ పడింది. కాగా సాయి శ్రీయ ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త అశోక్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

Also Read :

♦ బుల్లెట్టు బండి వధువు ఎవరు?

Tags

Next Story