TGPSC: టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

టీజీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. సంబంధిత దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సంతకం చేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి ఛైర్మన్‌గా ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బుర్రా వెంకటేశాన్ని ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డిని 2024 జనవరి 26న టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించారు. మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో తదుపరి చైర్మన్ పదవికోసం ప్రభుత్వం ఇటీవలె అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే తెలంగాణ వ్యక్తి, అనుభవమున్న సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను ఈ భాద్యతను తీసుకోవాలని ప్రభుత్వం కోరగా ఆయన అంగీకరించారు.
పదవీ బాధ్యతలు తీసుకునే ముందే ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేయాలి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబరు 2న సాయంత్రం లేదా 3వ తేదీన బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఐఏఎస్‌గా అధికారిగా ఆయనకు ప్రస్తుతం మూడున్నరేళ్లు పదవీ కాలం ఉంది. టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులైనందున 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. దీన్నిబట్టి ఆయనకు ఐదున్నరేళ్ల పాటు టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా వ్యవహరించేందుకు అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com