Business : కొత్త ఉత్పత్తులను రిలీజ్ చేసిన వెర్టిస్ గ్లోబల్

Business :  కొత్త ఉత్పత్తులను రిలీజ్ చేసిన వెర్టిస్ గ్లోబల్

షేవింగ్ బ్లెడ్స్ తయారీ సంస్థ వెర్టిస్ గ్లోబల్ కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసింది.సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో సేవ్ ఎక్స్, సిల్వర్ మ్యాక్స్ డిస్పోజబుల్ ప్రొడెక్ట్స్‌ను సంస్థ డైరెక్టర్ సాయితేజ,పురుషోత్తమ్‌లు ఆవిష్కరించారు. హైదరాబాద్ శామీర్‌పేట్‌లో 2016లో ప్రారంభమైన వెర్టిస్ గ్లోబల్ సంస్థ షేవింగ్ బ్లేడ్‌లు, మెటల్ రేజర్లు,డిస్పోజబుల్ రేజర్లు, షేవింగ్ క్రీమ్‌లాంటి ఉత్పత్తులుఅందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 200 మంది తమ సంస్థలో ఉపాధి పొందుతున్నారని.. 100 కోట్ల పెట్టుబడితో ఫ్లాంట్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు . తమ ఉత్పత్తులను ఇండియాతో పాటు మరో 30 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు వెల్లడించారు .

Tags

Next Story