నర్స్ నిర్లక్ష్యం.. ఫోన్‌ మాట్లాడుతూ రెండు డోసులు ఒకేసారి..

నర్స్ నిర్లక్ష్యం.. ఫోన్‌ మాట్లాడుతూ రెండు డోసులు ఒకేసారి..
తాజాగా హైదరాబాదు శివారు ప్రాంతానికి చెందిన ఓ నర్సు ఫోన్ మాట్లాడుతూ ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.

కరోనా కట్టడికి వ్యాక్సినే దారి అని తెలిసి జనం వ్యాక్సిన్ కేంద్రాల ముందు క్యూ కట్టేస్తున్నారు. దేశం మొత్తం మీదా రోజుకి లక్షల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతమైంది. తాజాగా హైదరాబాదు శివారు ప్రాంతానికి చెందిన ఓ నర్సు ఫోన్ మాట్లాడుతూ ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది. టీకా తీసుకున్న కొద్ది సేపటికే ఆ యువతి కళ్లు తిరిగి పడిపోయింది. అప్పటికే నర్సుకి తాను చేసిన పొరపాటు ఏంటో తెలిసింది.

అబ్దుల్లాపైర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్ సెంటర్‌కి ఓ యువతి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న నర్స్.. ఫోన్ మాట్లాడుతూ యువతకి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది. దీంతో ఆ యువతి కాసేపటికే కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story