BY POLL: తెలంగాణలో మరో ఉప ఎన్నిక తథ్యమా..?

BY POLL: తెలంగాణలో మరో ఉప ఎన్నిక తథ్యమా..?
X
దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేవనున్నదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేయనున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సీనియర్ నేతగా, నగర రాజకీయాల్లో బలమైన పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన దానం నాగేందర్ నిర్ణయం ఏదైనా రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అంతర్గత పరిణామాలు, తాజా రాజకీయ కదలికల నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. ఈ వార్తలు నిజమైతే, ఖైరతాబాద్ రాజకీయ ముఖచిత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ కొత్త చర్చలకు దారితీయనున్నాయి. ఇటీవల నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం తనకుందని, కార్యకర్తల అండతో ఆరుసార్లు గెలిచిన తాను మళ్లీ గెలిచి చూపిస్తానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు బురదజల్లుతున్నాయని ఆరోపించారు.

కీలక నిర్ణయం తీసుకునే దిశగా....

దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం గత కొంతకాలంగా అనేక మలుపులు తిరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై ఖైరతాబాద్ నుండి విజయం సాధించిన ఆయన.. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారడమే కాకుండా.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. అయితే.. అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మరో పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ 'అనర్హత పిటిషన్' వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉండటంతో ఏ క్షణమైనా ఉపఎన్నికలు రావచ్చనే ప్రచారం సాగుతోంది.

రాజీనామాకు కారణం వాళ్లే

తన ఈ ని­ర్ణ­యం వె­నుక గల కా­ర­ణా­ల­ను దానం మీ­డి­యా­తో పం­చు­కు­న్నా­రు. రా­జీ­నా­మా చే­య­డా­ని­కి, అవ­స­ర­మై­తే ఉపఎ­న్ని­క­ల్లో పోటీ చే­య­డా­ని­కి తన­కు­న్న ధై­ర్యం పా­ర్టీ కా­ర్య­క­ర్తల నుం­చే వచ్చిం­ద­ని అన్నా­రు. "రా­జీ­నా­మా చే­య­డా­ని­కి నా ధై­ర్యం కా­ర్య­క­ర్త­లే, ఉపఎ­న్ని­క­ల్లో పోటీ చే­య­డా­ని­కి కూడా కా­ర్య­క­ర్త­లే" అని ఆయన వ్యా­ఖ్యా­నిం­చా­రు. కాగా బీ­ఆ­ర్ఎ­స్ నుం­చి కాం­గ్రె­స్‌­లో­కి మా­రిన మొ­త్తం 10 మంది ఎమ్మె­ల్యే­ల­పై డి­స్‌­క్వా­లి­ఫి­కే­ష­న్ పి­టి­ష­న్లు పెం­డిం­గ్‌­లో ఉం­డ­గా, సీఎం రే­వం­త్ రె­డ్డి ఆదే­శి­స్తే తాను రా­జీ­నా­మా­కు సి­ద్ధ­మ­ని దానం నా­గేం­ద­ర్ ఇప్ప­టి­కే ప్ర­క­టిం­చా­రు.

Tags

Next Story