BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి

BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి
X
వేగంగా మారుతున్న పార్టీల సమీకరణాలు... టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న వార్తలు

తె­లం­గా­ణ­లో మరో ఉప ఎన్నిక రా­జ­కీయ వేడి రా­జే­స్తోం­ది. జూ­బ్లీ­హి­ల్స్ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్ మర­ణం­తో హై­ద­రా­బా­ద్‌­లో బై పోల్ అని­వా­ర్యం­గా మా­రిం­ది. ఆర్నె­ళ్ల­లో­పు ఎన్ని­క­లు జరి­గే అవ­కా­శం ఉం­డ­గా... రా­జ­కీయ పా­ర్టీ­లు తమ వ్యూ­హా­ల­కు పదు­ను పె­డు­తు­న్నా­యి. ఈ స్థా­నా­న్ని గె­లి­చి హై­ద­రా­బా­ద్ లో తమ సత్తా ని­రూ­పిం­చు­కో­వా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్... కం­టో­న్మెం­ట్ గె­లి­చి­న­ట్లే ఈ స్థా­నా­న్ని తమ ఖా­తా­లో వే­సు­కో­వా­ల­ని హస్తం పా­ర్టీ తీ­వ్ర కస­ర­త్తు చే­స్తు­న్నా­యి. జూ­బ్లీ­హి­ల్స్‌­లో పాగా వే­యా­ల­ని బీ­జే­పీ, ఎం­ఐ­ఎం కూడా బా­గా­నే ప్ర­య­త్ని­స్తు­న్నా­యి. రా­జ­కీయ సమీ­క­ర­ణా­లు వే­గం­గా మా­రు­తు­న్న వేళ... ఏపీ­లో అధి­కా­రం­లో ఉన్న కూ­ట­మి కూడా జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో బరి­లో­కి దిగే అవ­కా­శం ఉం­ద­న్న వా­ర్త­లు కూడా వస్తు­న్నా­యి. దీం­తో అన్ని పా­ర్టీ­ల­కు జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­కం­గా మా­రిం­ది. ఈ సమ­యం­లో తె­లం­గాణ రా­జ­కీ­యా­ల­ను జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక కొ­త్త మలు­పు తి­ప్ప­నుం­ద­న్నా వాదన వి­ని­పి­స్తోం­ది. తె­లం­గాణ రా­జ­కీయ ము­ఖ­చి­త్రా­న్ని ఈ ఎన్నిక పూ­ర్తి­గా మా­ర్చే­స్తుం­ద­న్న వాదన కూడా వి­ని­పి­స్తోం­ది.

వ్యూహాలకు, ఊహాగానాలకు వేదిక

జూ­బ్లీ­హిల్స్ ఉప ఎన్నిక రా­జ­కీయ వ్యూ­హా­ల­కు, ఊహా­గా­నా­ల­కు వే­ది­క­గా మా­రిం­ది. ఇప్ప­టి­కే ఉప ఎన్ని­కల వి­ష­యం­లో కొ­త్త పొ­త్తు­లు పొ­డి­చే అవ­కా­శం ఉం­ద­న్న ఊహా­గా­నా­లు మా­త్రం బలం­గా­నే వి­ని­పి­స్తోం­ది. అయి­తే ఈ ఊహా­గా­నా­ల­ను పూ­ర్తి­గా కొ­ట్టి­వే­సే పరి­స్థి­తి లే­ద­ని రా­జ­కీయ ని­పు­ణు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. జూ­బ్లీ హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గా­ని­కి ఉన్న ప్ర­త్యేక ప్రా­ధా­న్యత దృ­ష్టా, తె­లం­గా­ణ­లో­నే కా­కుం­డా,ఆం­ధ్ర ప్ర­దే­శ్ రా­జ­కీయ వర్గా­ల్లో­నూ జూ­బ్లీ ఉప ఎన్నిక గు­రిం­చి వి­స్తృత చర్చ జరు­గు­తోం­ది. ఈ ని­యో­జక వర్గం­లో 4 లక్షల మంది ఓట­ర్లు ఉంటే,అం­దు­లో చాలా మంది సె­టి­ల­ర్స్ ఉన్నా­రు. ఈ ఓట్లు ఎవ­రి­ప­ర­మై­తే వారి గె­లు­పు తథ్య­మ­న్న భావన చా­లా­మం­ది­లో ఉంది. ఎం­ఐ­ఎం కూడా ఇక్కడ కీలక పా­త్ర పో­షిం­చ­నుం­ది. ఇక్కడ లక్షా 20 వేల వరకు ము­స్లిం, మై­నా­రి­టీ ఓట్లు ఉన్నా­యి. ఈ ఓట్లు గె­లు­పు­లో కీలక పా­త్ర పో­షిం­చ­ను­న్నా­యి. అయి­నా జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో సె­టి­ల­ర్స్ ఓట్లే చాల కీ­ల­క­మ­న్న­ది కా­ద­న­లే­ని వా­స్త­వం. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­ర్గం­పై కాం­గ్రె­స్ లె­క్క­లు మరో­లా ఉన్నా­యి. హై­ద­రా­బా­ద్ లో జూ­బ్లీ­హి­ల్స్ కీ­ల­క­మైన ని­యో­జ­క­వ­ర్గం కా­వ­డం­తో ఈసా­రి హస్తం జెం­డా ఎగు­ర­వే­యా­ల­ని కాం­గ్రె­స్ భా­వి­స్తోం­ది.

2014లో గెలిచింది టీడీపీనే

రా­ష్ట్ర వి­భ­జన తర్వాత 2014లో జరి­గిన తె­లం­గాణ తొలి శాసన సభ ఎన్ని­క­ల్లో­నూ జూ­బ్లీ ని­యో­జక వర్గం నుం­చి తె­లు­గు దేశం పా­ర్టీ అభ్య­ర్ధి­గా పోటీ చే­సిన మా­గం­టి గో­పీ­నా­థ్’ వి­జ­యం సా­ధిం­చా­రు. ఆ తర్వాత ఆయన బీ­ఆ­ర్ఎ­స్’లో చే­రి­నా, వర­స­గా 2018, 2023 ఎన్ని­క­ల్లో ఆయ­న్ని గె­లి­పిం­చిం­ది మా­త్రం సె­ట్ల­ర్స్’ ఓట్లే. ఈ నే­ప­థ్యం­లో, తె­లం­గా­ణ­లో రీ-ఎం­ట్రీ­కి ప్ర­య­త్ని­స్తు­న­ట్లు చె­పు­తు­న్న, తె­లు­గు దేశం పా­ర్టీ, జూ­బ్లీ ఉప ఎన్ని­క­ను లాం­చిం­గ్ ప్యా­డ్’ చే­సు­కుం­టుం­ద­ని రా­జ­కీయ పరి­శీ­ల­కు­లు అం­టు­న్నా­రు. ని­జా­ని­కి, రా­ష్ట్రం­లో తె­లు­గు దేశం పా­ర్టీ­కి ఇప్ప­టి­కీ గట్టి పట్టుం­ది. రా­ష్ట్ర వి­భ­జన తర్వ­తా జరి­గిన 2014 ఎన్ని­క­ల్లో టీ­డీ­పీ 20 అసెం­బ్లీ స్థా­నా­లు గె­లు­చు కుం­ది. 2018లో టీ­డీ­పీ 2 అసెం­బ్లీ స్థా­నా­లు గె­లు­చు­కుం­ది. 2023 ఎన్ని­క­ల్లో మా­త్రం టీ­డీ­పీ తె­లం­గా­ణ­లో పో­టీ­చే­య­లే­దు. అయి­తే,ఇప్పు­డు మా­రిన రా­జ­కీయ సమీ­క­ర­ణాల నే­ప­థ్యం­లో టీ­డీ­పీ తె­లం­గా­ణ­లో తి­రి­గి కాలు మో­పేం­దు­కు సి­ద్డ­మ­వు­తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. అలా­గే, ఆం­ధ్ర ప్ర­దే­శ్’ లో సక్సె­స్ అయిన, టీ­డీ­పీ. జన­సేన, బీ­జే­పీ కూ­ట­మి ఫా­ర్ము­లా­ను తె­లం­గా­ణా­లో కొ­న­సా­గిం­చా­ల­ని కూ­ట­మి నా­య­కు­లు ఇప్ప­టి­కే ఒక ని­ర్ణ­యా­ని­కి వచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. అం­దు­లో భా­గం­గా జూ­బ్లీ ఉప ఎన్ని, టీ­డీ­పీ, జన­సేన, బీ­జే­పీ కూ­ట­మి పోటీ చే­స్తుం­ద­ని అం­టు­న్నా­రు. అయి­తే, కూ­ట­మి తర­పున, ఏపా­ర్టీ పోటీ చే­యా­లి, అభ్య­ర్థి ఎవరు అనే వి­ష­యం­లో మా­త్రం ఇంకా స్ప­ష్టత రా­లే­ద­ని అం­టు­న్నా­రు.

Tags

Next Story