Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నికలు.. నియోజకవర్గంలో నిఘా ఏర్పాట్లు..

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నికలు.. నియోజకవర్గంలో నిఘా ఏర్పాట్లు..
Munugode By-Poll: ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తమకున్న అన్ని వనరులనూ వాడుకుంటున్నాయి.

Munugode: ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తమకున్న అన్ని వనరులనూ వాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి కదలికపైనా నిఘా ఏర్పాటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల తరువాత అన్నీ పార్టీల్లో జోరుగా వలసలు కొనసాగుతున్నాయి.


దీంతో అన్నీ పార్టీలు ప్రత్యేక నిఘా వ్యవస్ధ ఏర్పాటు చేసుకున్నాయి. నేతల కదలికలపై ఏమాత్రం సమాచారం లేకపోవడంతో ఫిరాయింపులు ఎక్కువతున్నాయని ప్రధాన పార్టీలు వ్యూహాలు మార్చుతున్నాయి. గ్రామగ్రామాన నిఘా టీం లు పహారా కాస్తున్నాయి.



అధికార నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌,బీజేపీ, కాంగ్రెస్‌ నేతల్లో ఎవరితో టచ్‌లోకి వెళ్తున్నారు? ఏయే మంతనాలు సాగిస్తున్నారు? అవకాశం దొరికితే, సరైన బేరం కుదిరితే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న వారెవరు? అనే అంశాలపై నిఘా టీం లు పని చేస్తున్నాయట. అంతేకాక ఇన్‌ఛార్జ్‌ల పనితీరు ఎలా ఉంది అనే దానిపైన కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారట పార్టీల నేతలు.

మరోవైపు మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల పోటీ నుంచి పది మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఈ అభ్యర్థులతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చలు జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


అలాగే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో మాట్లాడి పార్టీ పరంగా తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూస్తామని మాటిచ్చారు. దీంతో.. ఆ 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అలాగే.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు.

మరోవైపు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను పార్టీల నేతలు సేకరిస్తున్నారు. పోలింగ్‌ రోజున వారిని స్వస్థలానికి రప్పించేందుకు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ప్రైవేట్‌ వాహనాలు బుక్‌ చేసి తరలించాల్సిన ఓటర్ల చిరునామాకు సంబంధించిన వివరాలు, వారి లొకేషన్‌ను ట్రావెల్స్‌ యజమానులకు చేరవేస్తున్నారు.


ఈ కార్యక్రమం చౌటుప్పల్‌, పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతోందని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు పోలింగ్‌ రోజు మునుగోడుకు చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకు, రెండు రోజులపాటు స్థానిక అవసరాలకు.. మొత్తంగా ఒక్కో ఓటరుకు దాదాపు పదిహేను వేలు ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారట.

ఇక పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న వేళ జంపింగ్‌ జపాంగ్‌లు పీక్స్‌కు చేరాయి. అసంతృప్త బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి నేతలు కారెక్కుతున్నారు. చండూరు, మునుగోడు మండలాలకు చెందిన ఆరుగురు సర్పంచులు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి చూసి గులాబీ కండువా కప్పుకున్నామంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story