BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... అన్ని పార్టీలకు రెఫరెండమే

BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... అన్ని పార్టీలకు రెఫరెండమే
X
అని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గ ఉప ఎన్నిక పో­లిం­గ్ ఈరో­జు జర­గ­నుం­ది. ­తెలం­గాణ రా­జ­కీయ ది­శ­ను ని­ర్ణ­యిం­చే కీలక ఉప ఎన్ని­క­గా ఈ బై పో­ల్‌­ను అన్ని పా­ర్టీ­లు పరి­గ­ణి­స్తు­న్నా­యి. సాం­స్కృ­తిక, వ్యా­పార, వి­ద్యా, సినీ వర్గాల సమ్మే­ళ­నం­గా ని­లి­చి, సా­మా­జి­కం­గా, ఆర్థి­కం­గా అత్యంత ప్ర­భా­వ­వం­త­మైన ఓట­ర్లు జూ­బ్లీ­హి­ల్స్ లో ఉన్నా­రు. అం­దు­కే ప్ర­తి రా­జ­కీయ పా­ర్టీ ఇక్కడ గె­ల­వ­డం కే­వ­లం ఓటు వి­జ­యం­గా కా­కుం­డా, ప్ర­జా­భి­ప్రా­యా­న్ని కొ­లి­చే సూ­చి­క­గా భా­వి­స్తోం­ది. మా­గం­టి గో­పీ­నా­థ్ ఆక­స్మిక మర­ణం­తో అని­వా­ర్యం­గా వచ్చిన ఈ ఉపఎ­న్నిక ఇప్పు­డు తె­లం­గాణ రా­జ­కీయ ది­శ­ను ని­ర్ణ­యిం­చే పరీ­క్ష­గా మా­రిం­ది. ఈ సీటు కోసం కాం­గ్రె­స్‌, బీ­ఆ­ర్ఎ­స్, బీ­జే­పీ మధ్య పోటీ కొ­న­సా­గు­తోం­ది. అధి­కా­రం­లో ఉన్న కాం­గ్రె­స్ పా­ర్టీ­కి ఇది ప్ర­భు­త్వ ప్ర­జా­ద­ర­ణ­ను ని­ల­బె­ట్టు­కు­నే పో­రా­టం­గా మా­రిం­ది. సీఎం రే­వం­త్ రె­డ్డి స్వ­యం­గా ఈ ఎన్ని­క­ను ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తీ­సు­కు­ని అభి­వృ­ద్ధి, సం­క్షేమ పథ­కాల అమలు, హై­ద­రా­బా­దు భవి­ష్య­త్తు వంటి అం­శా­ల­పై ప్ర­జ­ల్లో చై­త­న్యం కలి­గి­స్తు­న్నా­రు. మహి­ళా ఓట­ర్లు, మై­నా­రి­టీ­లు, ఉద్యోగ వర్గం, మధ్య­త­ర­గ­తి వర్గా­లు కాం­గ్రె­స్ లక్ష్యం­గా పె­ట్టు­కు­న్న ప్ర­ధాన వర్గా­లు. ప్ర­భు­త్వ పథ­కా­లు “ఇంటి దాకా చే­రా­యి” అనే సం­దే­శం­తో ప్ర­చా­రం సా­గు­తోం­ది.బీ­ఆ­ర్ఎ­స్ పక్షా­ని­కి ఈ ఉపఎ­న్నిక “పా­ర్టీ పు­న­రు­జ్జీ­వన సమరం”గా ని­లి­చిం­ది. అధి­కా­రా­న్ని కో­ల్పో­యిన తర్వాత కే­డ­ర్‌­లో ఏర్ప­డిన ని­స్పృ­హ­ను తొ­ల­గిం­చ­డా­ని­కి ఈ ఎన్నిక కీలకంగా మారనుంది.

బీ­జే­పీ­కి ఇది నగర రా­జ­కీ­యా­ల్లో తమ పు­నా­ది­ని బల­ప­ర­చు­కు­నే పరీ­క్ష. “మా­ర్పు ప్రా­రం­భం జూ­బ్లీ­హి­ల్స్ నుం­చే” అన్న ని­నా­దం­తో ప్ర­చా­రా­న్ని ము­మ్మ­రం చే­సిం­ది. రా­ష్ట్ర అధ్య­క్షు­డు రాం­చం­ద­ర్ రావు, కేం­ద్ర మం­త్రి కి­ష­న్ రె­డ్డి, బండి సం­జ­య్, ఈటల రా­జేం­ద్ర వంటి ప్ర­ము­ఖు­లు ప్ర­చార బృం­దా­న్ని బల­ప­రి­చా­రు. బీ­జే­పీ అభ్య­ర్థి లంకల దీ­ప­క్ రె­డ్డి స్థా­నిక వ్యా­పార వర్గా­ల్లో పరి­చ­యం కలి­గి ఉం­డ­టం పా­ర్టీ­కి ప్ర­యో­జ­నం­గా మా­ర­వ­చ్చు. ఇప్పు­డు అంతా ఓట­ర్ల చే­తు­ల్లో ఉంది. ఎవ­రి­కి పట్టం కడ­తా­రో.. ఎవ­ర్ని పా­తా­ళా­ని­కి తొ­క్కే­స్తా­రో అన్న ఉత్కంఠ తె­లు­గు రా­ష్ట్రా­ల్లో టె­న్ష­న్ పెం­చు­తోం­ది.

ఓటుకు రూ.2,500

ఓట­ర్ల­ను ప్ర­లో­భ­పె­ట్టేం­దు­కు ప్ర­ధాన పా­ర్టీ­లు పో­టీ­ప­డి పం­ప­కా­లు చే­ప­ట్టా­యి. ఓ పా­ర్టీ ఓటు­కు రూ.2,500 చొ­ప్పున పం­పి­ణీ చే­య­గా... మరో పా­ర్టీ మొదట రూ.వె­య్యి చొ­ప్పున ఇచ్చి... ప్ర­త్య­ర్థి పా­ర్టీ రేటు పెం­చ­డం­తో మరో రూ.వె­య్యి ఇచ్చేం­దు­కు సి­ద్ధ­మైం­ద­ని సమా­చా­రం. ఓ పా­ర్టీ వారు డి­వి­జ­న్‌­కు 5 వేల చొ­ప్పున 35 వేల కు­టుం­బా­ల­కు కు­క్క­ర్లు అం­దిం­చి­న­ట్లు తె­లి­సిం­ది. ఇంకో పా­ర్టీ వారు నగ­దు­తో పాటు లక్ష మంది మహి­ళ­ల­కు ఒక్కో­టి రూ.వె­య్యి వి­లువ చేసే పట్టు­చీ­ర­లు పం­పి­ణీ చే­శా­ర­ని సమా­చా­రం.




Tags

Next Story