BYPOLL: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం విడుదలకానుంది. ఎన్నికల సంఘం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సోమవారం నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
ఎంపీతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసిన నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ విజయం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయనకు భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. కాగా, అనిల్ కుమార్ యాదవ్ తండ్రి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నం చేయడం గమనార్హం. తనకు టికెట్ దక్కక పోవడంతో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేయగా పార్టీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌లు ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించారు.
కాంగ్రెస్ ప్రజాకంటక పాలనకు, కేసీఆర్.. ప్రజాపాలనకు మధ్య ఇది కీలక రిఫరెండం అని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. దీంతో జరుగుతున్నది ఉప పోరే అయినా.. సార్వత్రిక సమరాన్ని మించి ఇది రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక, మూడో పక్షం బీజేపీ కూడా ఇంత రేంజ్‌లో కాకపోయినా.. మోడీ పాలనకు… మోడీ అభివృద్ధికి ఇది మచ్చుతునకగా మారుతుందని అంటున్నారు. సో.. మొత్తంగా ఈ మూడు పార్టీలు కూడా జూబ్లీహిల్స్‌ను కీలకంగానే తీసుకున్నాయని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com