BYPOLL: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్‌గౌడ్‌..?

BYPOLL: జూబ్లీహిల్స్  బీజేపీ అభ్యర్థిగా విక్రమ్‌గౌడ్‌..?
X
మెగాస్టార్‌తో బీజేపీ చీఫ్ భేటీ

జూ­బ్లీ­హి­ల్స్​ఉప ఎన్ని­క­ల్లో కమ­ల­నా­థు­లు బీసీ వర్గా­ని­కి చెం­దిన యు­వ­నేత పోటీ చే­యి­స్తా­ర­నే ప్ర­చా­రం జరు­గు­తోం­ది. అనూ­హ్యం­గా మాజీ మం­త్రి ము­ఖే­ష్ గౌ­డ్​­త­న­యు­డు వి­క్ర­మ్​­గౌ­డ్​­పే­రు తెర మీ­ది­కి వచ్చిం­ది. ఆయన సీ­ని­య­ర్ల­తో టచ్‌­లో ఉన్న­ట్ల టా­క్​­వి­ని­పి­స్తోం­ది. గత అసెం­బ్లీ ఎన్ని­క­ల­కు ముం­దు బీ­జే­పీ­లో చే­రిన వి­క్ర­మ్ గౌడ్ టి­కె­టు కోసం ప్ర­య­త్నా­లు చే­శా­రు. కాం­గ్రె­స్ ​­బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల అంశం ఫె­యి­ల్​అ­యి­తే ఉప ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కే టి­కె­ట్లు ఇచ్చా­మ­నే ప్ర­చా­రం చే­సు­కు­నేం­దు­కు నవీ­న్​­యా­ద­వ్‌­కు ఇచ్చి­న­ట్లు చర్చ జరు­గు­తోం­ది. ఇప్ప­టి­కే కాం­గ్రె­స్​­బీ­సీ రి­జ­ర్వే­ష­న్ల­కు వ్య­తి­రే­కం­గా బీ­జే­పీ ఉం­ద­నే వి­మ­ర్శ­ల­కు చె­క్​­పె­ట్టేం­దు­కు బీసీ నే­త­కు టి­కె­ట్లు ఇచ్చేం­దు­కు పరి­శీ­లన చే­స్తు­న్న­ట్లు తె­లి­సిం­ది.

ఉప ఎన్నికల్లో 200 నామినేషన్లు

తె­లం­గా­ణ­లో ఉప ఎన్నిక కాక రే­పు­తోం­ది. జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక కోసం జి­ల్లాల వా­రీ­గా 200 మంది మా­ల­లు నా­మి­నే­ష­న్లు వే­సేం­దు­కు సన్న­ద్ధ­మ­వు­తు­న్న­ట్లు తె­లం­గాణ మాల సం­ఘాల జే­ఏ­సీ ప్ర­క­టిం­చిం­ది. తె­లం­గా­ణ­లో ఆరు నె­ల­లు­గా జరి­గిన ఉద్యోగ ని­యా­మ­కా­ల్లో ఎస్సీ­లో­ని 58 కు­లా­ల­కు తీ­ర­ని అన్యా­యం జరి­గిం­ద­ని పే­ర్కొం­ది. కాం­గ్రె­స్‌­ను ఓడిం­చేం­దు­కే ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు జే­ఏ­సీ ఛై­ర్మ­న్ మం­దాల భా­స్క­ర్ వె­ల్ల­డిం­చా­రు. ఇది కాం­గ్రె­స్‌­తో పాటు మి­గి­లిన పా­ర్టీ­ల­ను ఆం­దో­ళన పరు­స్తోం­ది.

చిరంజీవిని కలిసిన బీజేపీ అధ్యక్షుడు

బీ­జే­పీ తె­లం­గాణ రా­ష్ట్ర అధ్య­క్షు­డు రా­మ­చం­ద్ర­రా­వు, ఆయన కు­టుం­బం సినీ నటు­డు చి­రం­జీ­వి­ని, నయ­న­తా­ర­ను షూ­టిం­గ్‌ స్పా­ట్‌­లో కలి­శా­రు. ఆస్ట్రే­లి­యా నుం­చి వచ్చిన తన మన­వ­రా­లు ఐరా ఆశీ­ష్‌ కో­రిక మే­ర­కు వారు మర్యా­ద­పూ­ర్వ­కం­గా భేటీ అయ్యా­రు. ఈ సం­ద­ర్భం­గా సినీ వి­శే­షా­లు, సమ­కా­లీన రా­జ­కీ­యా­లు, ప్ర­జా సమ­స్య­ల­పై సు­దీ­ర్ఘం­గా చర్చిం­చా­రు. తమకు సమయం కే­టా­యిం­చిన చి­రం­జీ­వి­కి రా­మ­చం­ద్ర­రా­వు కృ­త­జ్ఞ­త­లు తె­లి­పా­రు. చి­రం­జీ­వి­తో పాటు హీ­రో­యి­న్ నయ­న­తా­ర­ను కూడా రా­మ­చం­ద­ర్ రావు కు­టుంబ సభ్యు­లు కలి­శా­రు. చి­రం­జీ­వి­తో జరి­గిన సమా­వే­శం­లో సి­ని­మా వి­శే­షా­ల­తో పాటు, సమ­కా­లీన రా­జ­కీ­యా­లు, ప్ర­జా సమ­స్య­ల­పై వి­స్తృ­తం­గా చర్చిం­చి పలు ఆలో­చ­న­లు పం­చు­కు­న్న­ట్లు ఆయన పే­ర్కొ­న్నా­రు.






Tags

Next Story