CABINET: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్, అజారుద్దీన్

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్‌ను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు చోటు లభించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు కేబినెట్లో తీర్మానించి గవర్నర్‌కు పంపింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న అజారుద్దీన్‌ను అనూహ్యంగా ప్రభుత్వం.. ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.
కేసీఆర్ రాజీనామా చేయాలి'
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందని, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని అన్నారు. రాకపోతే ప్రతిపక్ష నేత హోదాకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ కూడా జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పై తప్పు పట్టారు. ప్రజల తరుపున సమాధానం చెప్పకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరుకాకపోవడం వల్ల ఆయనకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అన్న ప్రశ్నను ప్రభుత్వవర్గాలు నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగే తప్పులపై ప్రతి సత్యాన్ని అసెంబ్లీ ముందు వెల్లడించాలి అని ఆయన గుర్తుచేశారు. హరిష్ రావు వంటి ప్రతిపక్ష నేతలు వేదికపై మాట్లాడితేనే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కారణం ఉందా అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com