ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

X
By - kasi |10 Oct 2020 5:11 PM IST
యాసంగిలో నిర్ణీత పంట సాగు, ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ నెల 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. కేబినెట్ తీర్మానాల్ని బిల్లు రూపంలో ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే... జీహెచ్‌ఎంసీ చట్టంలో మార్పులపైనా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com