Munugode: ఊపందుకున్న మునుగోడు బైపోల్ ప్రచారం..

Mnugode Bypoll campaign speed up
Munugode: ఊపందుకున్న మునుగోడు బైపోల్ ప్రచారం..
Munugode: నల్లగొండ జిల్లా మునుగోడు బైపోల్లో పార్టీల ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Munugode: నల్లగొండ జిల్లా మునుగోడు బైపోల్లో పార్టీల ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బరిలో దిగేందుకు టీడీపీ సై అంటోంది. టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్‌ పేరు పరిశీలనలో ఉంది. బీసీ వర్గానికి చెందిన ఆయన ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో జక్కలి ఐలయ్యకు బీసీ నేతగా మంచి పేరు ఉంది. మరోవైపు నియోజకవర్గంలో బీసీ వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు.

మునుగోడు బై పోల్ ప్రచారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేయడంతో పాటు...ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రధాన పార్టీలు.. తమ బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను వీక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాతో పాటు అన్ని మార్గాలను ఆశ్రయిస్తున్నాయి ప్రధాన పార్టీలు.

ఇక ప్రచారంలో భాగంగా అభ్యర్థులు గడప గడపకూ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.ఇక ఇవాళ్టి నుంచి మునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించనుంది. చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. తూప్రాన్ పేట్, మల్కాపురం, ఖైతాపురం, ఎల్లంబావి, ధర్మోజిగూడెం, కొయ్యలగూడెం, అల్లాపురం, ఎనగొండి తండా, దుబ్బతండాలో ప్రచానం నిర్వహించనున్నారు.


ఇక గట్టుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఏండ్లుగా ఉద్యమం చేసినా రాని గట్టుప్పల్ మండలం రాజ గోపాల్ రెడ్డి రాజీనామాతో ఒక్కరోజులోనే వచ్చిందనే విషయాన్నీ ప్రతి ఒక్కరికీ తెలియజేస్తూ లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు.

మునుగోడులో ఇంటింటి ప్రచారాలు, నేతల డైలాగ్ వార్ తో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక మునుగోడు బైపోల్ ఫై సీరియస్ గా ఫోకస్ చేసిన TRS... అన్ని గ్రామాలను మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టేస్తున్నారు. ఈనెల 30న చండూరులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనుంది. సభకు సంబంధించి ఇప్పటికే అక్కడి లీడర్లతో మంత్రి జగదీశ్ రెడ్డి చర్చించారు.అటు కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారంతో పాటు... పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరుస సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12 మంది అభ్యర్థులు 17 సెట్ల నామినేషన్లు వేశారు.నాంపల్లి మండలంలో PCC చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. ముస్టిపల్లి, పసునూర్, దామెర, TP గౌరారం గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story