Car Racing : హైదరాబాద్‌లో మళ్లీ కార్ రేసింగ్

Car Racing : హైదరాబాద్‌లో మళ్లీ కార్ రేసింగ్
X
Car Racing : హైదరాబాద్‌లో మళ్లీ కార్ రేసింగ్ జరగనుంది. ఈనెల 10, 11వ తేదీల్లో హుస్సేన్‌సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ నిర్వహించనున్నారు.

Car Racing : హైదరాబాద్‌లో మళ్లీ కార్ రేసింగ్ జరగనుంది. ఈనెల 10, 11వ తేదీల్లో హుస్సేన్‌సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ నిర్వహించనున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మొత్తం 4 సెషన్స్ ఉంటాయి. చెన్నైలో మూడు రేసింగ్‌లు జరిగాయి.


ఫైనల్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కార్ రేసింగ్ నిర్వహించనున్నారు. 6 టీమ్‌లు, 12 కార్లు, 24 రేజర్లు పాల్గొంటారు. ఇప్పటికే చెన్నై నుంచి కార్లు హైదరాబాద్‌ చేరుకున్నాయి. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని VIPలకు, సందర్శకులకు వేరు వేరు గ్యాలరీల ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ రాత్రి వరకు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Tags

Next Story