KTR: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో A1గా కేటీఆర్

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌ను.. ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఫార్ములా-ఈ కార్ రేసు విషయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచారణకు అనుమతులు ఇవ్వడంతో ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమైనట్లు తెలుస్తోంది. కేటీఆర్‌పై నమోదైన FIRలో ఏసీబీ అధికారులు కీలక అంశాలు ప్రస్తావించారు. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్‌ఈవోకు నిధులు బదలాయించినట్టు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా HMDAకి చెందిన రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. ‘ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోకుండా HMDA నిధులు వినియోగించారు. చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిబంధనలు ఉల్లంఘించారు. 5 అంశాల్లో అక్రమాలు జరిగినట్టు దానకిషోర్ ఫిర్యాదు’ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
చిల్లర వ్యూహాలకు భయపడతామా: కవిత
ఫార్మూలా ఈ రేస్ వివాదంలో కేటీఆర్ పై కేసు నమోదవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేటీఆర్ పై అక్రమ కేసు నమోదు చేశారని కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చిల్లర వ్యూహాలకు భయపడబోమని వెల్లడించారు. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కవిత అన్నారు. తాము కేసీఆర్ సైనికులమని కవిత అన్నారు.
కేటీఆర్‌పై కేసుతో భగ్గుమన్న గులాబీ నేతలు
ఫార్మూలా ఈ కారు రేస్ నిధుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. హామీలు అమలు చేయని అధికార పార్టీ.. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ అక్రమ కేసు నమోదు చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోరాటం తమకు కొత్త కాదని.. అక్రమ కేసులతో గొంతులను నొక్కలేరని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com