ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు

కరీంనగర్ కోర్టు ఆదేశాలతో ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదైంది.. హిందు దేవతలను కించపర్చేలా ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేశారంటూ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ మాజీ ఐపిఎస్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో త్రీటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేవారు.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు, శంకర్ బాబుపైనా కేసు నమోదు చేశారు.
అయితే, సామాన్యులను విచారించినట్టే వీరిపైనా సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారు మహేందర్ రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మానికి, దేశానికి వ్యతిరేకంగా సెక్యులర్ ముసుగులో ఇక ముందు ఎవరైనా మాట్లాడితే వాళ్లు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. అలాగే స్వేరోస్ సంస్థ గురుకులాలకు విద్యార్థులతో ఇలాంటి హిందూ వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయిస్తూ హిందూ వ్యతిరేక భావజాలాన్ని నింపుతోందని.. ఈ సంస్థను వెంటనే నిషేధించాలని మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com