Raja Singh : పాత బస్తీలో కొనసాగుతున్న టెన్షన్.. రాజాసింగ్‌కు పోలీస్ నోటీసులు..

Raja Singh : హైదరాబాద్ పాత బస్తీలో హై టెన్షన్ కొనసాగుతోంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్‌తో పాతబస్తీ అట్టుడికిపోతోంది. MIM కార్యకర్తలు మంగళవారం అర్థరాత్రి నుంచి రోడ్ల పైకి వచ్చి ఆందోళన
చేశారు.. ఇవాళ సైతం ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అయ్యాయి. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ ర్యాలీలు తీశారు. సర్దిచెప్పేందుకు యత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పాతబస్తీ పూర్తిగా పోలీసుల నిఘా నీడలోకి వెళ్లిపోయింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దిగింది. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు కేసుల్లో 41 (A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి, ఏప్రిల్‌కు సంబంధించిన కేసుల్లో రాజాసింగ్‌కు మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్ పీఎస్ పోలీసులు నోటీసులిచ్చారు. మంగళ్‌హాట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నెంబర్ కేసులో నోటీసులిచ్చిన పోలీసులు. పలు సెక్షన్ల కింద పోలీసులు నోటీసులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com