Casino Case: చికోటి ప్రవీణ్ కు ఐటీ నోటీసులు

Casino Case: చికోటి ప్రవీణ్ కు ఐటీ నోటీసులు
రేంజ్ రోవర్ కారు ఎలా కొనుగోలు చేశారన్న దానిపై నోటీసులు

క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు.చికోటి ప్రవీణ్ రేంజ్ రోవర్ కారు ఎలా కొనుగోలు చేశారన్న దానిపై నోటీసులు ఇచ్చారు. ఈ కారు ఖరీదు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.అయితే ఈ కారును బినామీ పేరుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. భాటియా ఫర్నీచర్ పేరు మీద కారు రిజిస్ట్రేషన్ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ చీకోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు ప్రవీణ్.

Tags

Next Story