CBI: "ఇందూ"లో వైవీ సుబ్బారెడ్డి లబ్ధి పొందారన్న సీబీఐ

CBI: ఇందూలో వైవీ సుబ్బారెడ్డి లబ్ధి పొందారన్న సీబీఐ
తెలంగాణ హైకోర్టుకు తెలిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ... ఆధారాలు ఉన్నట్లు వెల్లడి

ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్ బోర్డుకు చెందిన ప్రాజెక్టులో వై. వి.సుబ్బారెడ్డి లబ్ధి పొందారంటూ సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. పెద్దవాళ్ల ముడుపులు పైకి కనిపించవని, అంతర్గతంగా ఉంటాయని పేర్కొంది. లాభాల్లేని ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారన్న CBI, అయితే ప్రాజెక్టులో పూర్తయిన విల్లాలను వై. వి. సుబ్బారెడ్డి, వసంత కృష్ణప్రసాద్‌నిబంధనలకు విరుద్ధంగా తమ బంధువులు, సన్నిహితులకే ఏకపక్షంగా కేటాయించి లబ్ధి పొందారని వివరించింది.

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా తనపై నమోదైన ఇందూ-హౌసింగ్‌ బోర్డు కేసు కొట్టివేయాలంటూ YS తోడల్లుడు, TTD మాజీ ఛైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనలు వినిపించిన సీబీఐ న్యాయవాది ఒక్క పైసా చెల్లించకుండా ప్రాజెక్టులో 50 శాతం వాటా పొందారని వివరంచారు. ఈ కేసులో ప్రాజెక్టును పొందడం నుంచి అక్రమాలే జరిగాయన్నారు. ఒక్క కంపెనీకీ అర్హత ఉండదని., కన్సార్టియంగా ఏర్పడి ప్రాజెక్టును దక్కించుకున్నాయని తెలిపారు.


గచ్చిబౌలిలోని 4.29 ఎకరాల్లో ప్రాజెక్టును ఇందూ శ్యాంప్రసాద్రిరెడ్డి ప్రతిపాదన మేరకు SPVగా వసంత ప్రాజెక్టుకు గృహ నిర్మాణ మండలి కేటాయించిందన్నారు. SPVలో ఇందూ, ఎంబసీ, యూనిటీ, సోమా కంపెనీలకు వాటాలున్నట్లు చెప్పారన్నారు. అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేసేనాటికి వసంత ప్రాజెక్ట్స్ లో కేవలం..కృష్ణప్రసాద్, తల్లి హైమావతికి మాత్రమే వాటాలున్నాయన్నారు. ప్రాజెక్టులో వై.వి. సుబ్బారెడ్డి భాగస్వామిగా చేరినపుడు ముందుగా గృహ నిర్మాణ మండలి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి దీనికి సంబంధించి ఒప్పందంలో నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఒప్పందం వివరాలను తదుపరి విచారణలో సమర్పిస్తానని CBI న్యాయవాది చెప్పారు. వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారని, ప్రతి అంశాన్నీ ఫైళ్లు స్పష్టంగా చెబుతాయన్నారు. లబ్ధి పొందలేదనడం సరికాదని, ప్రాజెక్టు పూర్తయ్యాక విల్లాల విక్రయంతో ప్రయోజనం పొందారన్నారు.

అంతకుముందు వైవీ తరఫున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఎలాంటి ముడుపులు ఇవ్వడంగానీ, ప్రయోజనం పొందడంగానీ చేయలేదన్నారు. విఫలమైన ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి Ysకు తోడల్లుడు అనే కారణంగా ఈ కేసులో ఇరికించారన్నారు. సీబీఐ కూడా ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. అందువల్ల కేసు కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story