MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర ఉత్కంఠ..

X
By - Prasanna |6 Dec 2022 12:33 PM IST
MLC Kavitha: MLC కవిత నివాసం దగ్గర ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది..సీబీఐ విచారణపై సస్పెన్స్ వీడలేదు.
MLC Kavitha: MLC కవిత నివాసం దగ్గర ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది..సీబీఐ విచారణపై సస్పెన్స్ వీడలేదు.హైదరాబాద్‌లోనే ఉన్నా ఇంకా సీబీఐ అధికారులు కవిత ఇంటికి చేరుకోలేదు.. అయితే ఒంటి గంట వరకు వేచి చూడాలని కవిత అనుకుంటున్నట్లు సమాచారం..ఆ తరువాత జగిత్యాలకు వెళ్లనున్నారు కవిత.
రేపు బహిరంగ సభ అనంతరం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.. ఇక ఇవాళ11 గంటలకు హాజరు కావాలని 160 CRPC కింద నోటీసులు ఇచ్చినా సీబీఐ అధికారులు ఇంకా కవిత ఇంటికి చేరుకోక పోవడంపై అందరి లోనూ ఉత్కంఠ నెలకొంది.అటు విచారణకు ఇవాళ అందుబాటులో ఉండనని, సమయం కోరుతూ సీబీఐకి రాసిన లేఖపై ఇప్పటి వరకు సమాధానం ఇవ్వ లేదు సీబీఐ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com