CBI: సీబీఐ విచారణ ఆపాలని చెప్పలేం: హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులకు చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మరోసారి పిటిషన్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారు. కాళేశ్వంపై దర్యాప్తు చేయాలని ఘోష్ నివేదికను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని న్యాయవాదులు కోరారు. అయితే కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది.
కాళేశ్వంపై ధర్యాప్తు చేయాలని ఘోష్ నివేదికను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని న్యాయవాదులు కోరారు. అయితే కాళేశ్వరం నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com