తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇవ్వనున్న రక్షణ శాఖ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా స్కైవేలు, మెట్రో కారిడార్‌కు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి 33 ఎకరాల భూమిని ఇచ్చేందుకు కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది. రాజీవ్ జాతీయ రహదారిపై 15 ఎకరాలు, నాగ్‌పూర్ జాతీయ రహదారిపై 18 ఎకరాల రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది.
NH-44 ప్యారడైజ్ - సుచిత్ర, NH-1 జింఖానా గ్రౌండ్ - హకీంపేట్ వరకు రోడ్డు విస్తరణకు కంటోన్మెంట్ భూముల్ని ఇచ్చేoదుకు తీర్మానాన్ని ఆమోదించామని కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ తెలిపారు. 33 ఎకరాల భూమిని ఇచ్చేందుకు పాలక మండలి ఓకే చెప్పింది. ఆర్మీ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, బీ-2 మొత్తం 124 ఎకరాలకు సంబంధించి అంగీకార విషయం ఆయా శాఖలు చూస్తాయన్నారు. రక్షణ శాఖకు చెందిన మొత్తం 157 ఎకరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. రోడ్డు విస్తరణకు రక్షణ శాఖ నుండి వచ్చిన ప్రతిపాదనల తీర్మానాన్ని కంటోన్మెంట్ పాలక మండలి ఆమోదించిందన్నారు. 33 ఎకరాలకు 329 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కంటోన్మెంట్ పరిధిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com