Cloud Burst : క్లౌడ్ బరస్ట్ నిజమైతే కేసీఆర్ ఆధారాలు చూపాలి : కిషన్ రెడ్డి

Cloud Burst : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో భద్రాచలంలోని గోదావరి ముంపుప్రాంతాలనుపరిశీలించేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని.. అందుకే క్లౌడ్ బరస్ట్ ద్వారా భారీ వర్షాలు కురిపించారంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఉత్తరాఖండ్ వరదలతోపాటు.. ప్రస్తుత గోదావరి వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని కేసీఆర్ అన్నారు. క్లౌడ్ బరస్ట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్‌కు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఏ దేశం, ఏజెన్సీ చేసిందో చెపిత చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదిమాట్లాడినా ప్రత్యేకతే.. ఆయన భద్రాచలం ముంపుప్రాంతాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. భారీ వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణమని.. ఇందులో విదేశీ కుట్రదాగి ఉందని సీఎం ఆరోపించారు. అయితే సీఎం మాటలపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎంకు క్లౌడ్ బరెస్టుకి సంబంధించిన సమాచారం ఉంటే కేంద్రానికి అప్పగించాలంటూ పలువురు నేతలు కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. యానాంలో పర్యటించిన గవర్నర్ అక్కడ ముంపు ప్రాంతాలపై అధికారులతో సమీక్ష జరిపారు..బాధితులకు తక్షణ సహాయంగా ఆహారం, మందులు అందించాలని అధికారులను ఆదేశించారు.
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ హోదాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తమిళిసై.... గోదావరికి వరదలు వచ్చినప్పుడు గ్రామాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 130 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ చేపడుతున్నామని దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులను సమకూర్చుతున్నట్లు తమిళిసై అన్నారు.
సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ జరిగిందన్న వ్యాఖ్యలపై ..కేంద్రమంత్రికిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్‌ల ద్వారా విదేశీ సంస్థలకు కుట్ర చేస్తాయన్న విషయం తనకు ఇంత వరకు తెలియదంటూ ఎద్దేవా చేశారు... సీఎం కేసీఆర్ సంపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి.. ఆయన చెప్పే వాటిలో అన్నీ నిజాలే ఉంటాయని, ఆధారాలు లేకుండా క్లౌడ్ బరస్ట్‌పై మాట్లాడరని అన్నారు.
ఏయే దేశాలు, ఏ ఏజెన్సీలు క్లౌడ్ బరస్ట్ చేశాయో చెబితే.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే సీఎం కేసీఆర్ తన దగ్గరున్న ఆధారాలను కేంద్రానికి ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
మొత్తం మీద కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.దీనిపై విక్షాలు మండిపడుతున్నాయి. ఆధారాలుఉంటే కేంద్రానికి ఇచ్చి దర్యాప్తులో
సహాకరించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com