నల్లగొండలో కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పర్యటన

నల్లగొండలో కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పర్యటన
X
పార్లమెంట్ ప్రభాస్ యోజనలో భాగంగా ఆదివారం బీజేపీ నల్లగొండ పార్లమెంటు ఇంచార్జ్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పర్యటన

పార్లమెంట్ ప్రభాస్ యోజనలో భాగంగా ఆదివారం బీజేపీ నల్లగొండ పార్లమెంటు ఇంచార్జ్, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు 'నక్కలగండి ప్రాజెక్టు' సందర్శించనున్నారు. తరువాత గుర్రంతండలో ఎస్టీ సామాజిక వర్గ ప్రజలతో సమ్మేళనంలో పాల్గొంటారు. అలాగే గిరిజనులతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమం అయిపోగానే అదే రోజు రాత్రి మిర్యాలగూడలో బస. మరుసటి రోజు మిర్యాలగూడలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రైస్ మిల్లర్ అసోసియేషన్ల వారితో మాటా మంతిలో పాల్గొంటారు.

Tags

Next Story